విశాఖ నగరానికి ఈ దశాబ్దం శుభారంభం కానుంది. ప్రధానంగా విశాఖ మహానగరాభివృద్థి సంస్థ పరిధిలో పలు ప్రాజెక్టులకు ఈ ఏడాదిలో ఒక రూపు తెచ్చే విధంగా విఎంఆర్డీఎ యత్నిస్తోంది. సీఎం జగన్ ఇటీవలే 379 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖ సాగర తీరంలో ఉన్న కురుసుర జలాంతర్గామి ప్రదర్శన శాల, టీయూ 142, సీ వారియర్స్ ప్రదర్శనశాలలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రకృతి చరిత్ర ప్రదర్శనశాల, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ... కేంద్రసంస్థల సహకారంతో రంగంలోకి దిగింది. అందుకు అనువుగా ఉన్న ప్రాంతంగా కైలాసగిరిని గుర్తించారు. నక్షత్రశాలనూ నిర్మించనున్నారు. విశాఖకు ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు తెస్తుందని అధికారుల అంచనా. బహుళ అంతస్థుల వాహనాల పార్కింగ్ వంటివీ నగర అవసరాలను తీరుస్తాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి