ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. విశ్వ విజ్ఞాన విద్య అధ్యాత్మిక పీఠం(ట్రస్టు) ఆధ్వర్యంలో రెండు గ్రంథాలు అవిష్కరించనున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 5న విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరగనున్న సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని నవమ పీఠాధిపతి డా.ఉమర్ అలీషా పేర్కొన్నారు(navama trust chairman Dr. Umar Alisha on books release). ఈ మేరకు డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
విశ్వమానవ శ్రేయస్సు, తత్వ ప్రభోదం, సామాజిక శ్రేయస్సు కోసం ఈ పీఠం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వేదాంతం నుంచి జాతీయ భావం వైపు(1904-1945), డిబేట్స్ ఆఫ్ డా. ఉమర్ అలీషా ఇండియన్ నేషనల్ అసెంబ్లీ(1935-1945) అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సమావేశంలో ట్రస్ట్ కన్వీనర్ డా.ఆనంద్ కుమార్ పింగళి, పోగ్రాం కన్వీనర్ ప్రసాద్ వర్మ, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..