ETV Bharat / city

పీల్చే గాలే శత్రువు...కాలుష్యమే ప్రాణాంతకం

మనం పీలుస్తున్న గాలే మనల్ని తినేస్తోందా? ప్రాణవాయువు మాటున ప్రమాదకర వాయువులనూ పీల్చుతున్నామా? అవగాహనతో మెలగకపోతే విపరీత పరిణామాలు ఎదుర్కొక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు, పలు రకాల క్యాన్సర్లతో మరణిస్తున్నా వాటికి మూలం మాత్రం మనం పీల్చే ప్రాణాంతక కాలుష్యకారకాలే. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా వనరుల వినయోగం నుంచి వచ్చే ఉద్ఘారాల వల్ల నష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

National pollution control day
National pollution control day
author img

By

Published : Dec 2, 2020, 6:00 AM IST

మనం పీలుస్తున్న గాలే మనకు శత్రువా?అవును కంటికి కనిపించని శత్రువుతో సంవత్సరాలుగా పోరాడుతున్నాం. దేశంలో కరోనా వల్ల జరిగిన ప్రాణ నష్టం కన్నా గాలి కాలుష్యం వల్ల 10 రెట్లు ఎక్కువ నష్టం కలుగుదోందనేది చేదు వాస్తవం. 2019 సంవత్సరంలో గాలి కాలుష్యం కారణంగా 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2020 నివేదిక వెల్లడించింది. గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి కారణాలతో ఈ మరణాలు సంభవించినా మూలం మాత్రం పీల్చే గాలిలోని ప్రాణాంతక కాలుష్య కారకాలే అని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరీ దయనీయమైన వాస్తవం ఏంటంటే కాలుష్య ప్రభావానికి లక్షా 16 వేల మంది శిశువులు జన్మించిన నెల రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

ఊహించని స్థాయిలో మనల్ని నష్టపరుస్తోన్న కాలుష్యానికి కారణం మనమే. మితిమీరిన వనరుల వినియోగం కారణంగానే వాయు కాలుష్యం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన కలగనంత కాలం కాలుష్యకారకాలకు అడ్డుకట్ట వేయలేమని నిపుణులు చెబుతున్నారు.

ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, స్పృహతో మెలిగితే కాలుష్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తే మాత్రం భవిష్యత్‌ మనుగడ కూడా కష్టమేనని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి : పేటీఎం గుడ్‌న్యూస్‌- ఆ ఛార్జీలన్నీ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.