ETV Bharat / city

నెలాఖరులో నర్సీపట్నం మోడల్‌ పోలీసు స్టేషన్‌ ప్రారంభం..!

నర్సీపట్నంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీసు స్టేషన్‌ భవనాన్ని ఏఎస్పీ తుహిన్‌సిన్హా పరిశీలించారు. ఈ నెలాఖరులో ఈ స్టేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నందున ముందుగా పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు.

NARSIPATNAM MODEL POLICE STATION
నర్సీపట్నం మోడల్‌ పోలీసు స్టేషన్‌
author img

By

Published : Oct 27, 2020, 2:14 PM IST

విశాఖ ఏజెన్సీ ముఖద్వారం, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు విశాఖ మన్యానికి, మైదాన ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉన్న నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో కేసుల నమోదు రేటు అధికంగా ఉండటంతో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ నిర్మించారు.

నర్సీపట్నం ముఖ్య కూడలిగా తరచూ వాహన ప్రమాదాలు, గంజాయి కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో..మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేశారు. నిర్మాణ పనులు కూడా అప్పట్లోనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటం తదితర కారణాల వల్ల సుమారు పదిహేను నెలలుగా ప్రారంభానికి నోచుకోలేదు.

మరోపక్క నిర్మాణం పూర్తయిన భవనం బూజు పడుతూ దుమ్ము ధూళితో నిండిపోతోంది. ఈ క్రమంలో నర్సీపట్నం ఏఎస్పీ తుహీన్ సిన్హా కొత్త పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.

ఇదీ చదవండి:

నైపుణ్యం ఉంటేనే కొలువు... మారిన కంపెనీల ఆలోచనా విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.