ETV Bharat / city

MP Satyanarayana: 'స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణను ఆపేందుకు సీఎం యత్నం' - విశాఖ జిల్లా వార్తలు.

వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటీకరించవద్దంటూ అనేక రోజులుగా దీక్ష చేస్తున్న కార్మికులకు విశాఖ ఎంపీ సత్యనారాయణ(MP Satyanarayana) సంఘీభావం తెలిపారు. దీనిపై చర్చించేదుకు.. విజయసాయిరెడ్డితో కార్మిక నాయకులు కలవనున్నట్లు ఎంపీ సత్యనారాయణ తెలిపారు.

MP Satyanarayana
స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణను ఆపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు
author img

By

Published : Jul 14, 2021, 10:30 PM IST

నేటితో 153వ రోజుకు చేరిన విశాఖ స్టీల్​ ప్లాంట్(VIZAG STEEL PLANT)​ కార్మికుల దీక్షకు.. విశాఖ ఎంపీ సత్యనారాయణ(MP Satyanarayana) సంఘీభావం ప్రకటించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం కానివ్వమని అన్నారు. అనేకమంది ప్రాణత్యాగాల ఫలమైన స్టీల్​ ప్లాంట్​ను కాపాడి కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. వైజాగ్​ స్టీల్​ ప్రైవేటుపరం కాకుండా నిలువరించేందుకు సీఎం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ తెలిపారు. ఇప్పటికే కార్మిక నాయకులతో ఎయిర్ పోర్టులో చర్చలు జరిపి.. ముఖ్యమంత్రి కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ నెల 15 న వైకాపా ఎంపీలందరూ ముఖ్యమంత్రితో సమావెేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికకు రూపకల్పన చేస్తామన్నారు. ఈ నెల 20న కార్మిక నాయకులను తీసుకుని కేంద్ర మంత్రులను కలవనున్నట్లు ఎంపీ సత్యనారాయణ వెల్లడించారు. కార్మికులు దీనిపై దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్క్యూట్​ హౌస్​లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో కార్మిక నాయకులు సమావేశం జరగనున్నట్లు తెలిపారు. తమ పార్టీ విశాఖ ఉక్కును కాపాడేందుకు కార్మికులకు అండగా నిలుస్తుందని ఎంపీ పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి:

ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- వీరే అర్హులు!

Visakha steel protest: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం: మంత్రి అవంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.