"అమ్మ"ను రోడ్డుమీద వదిలేయవద్దు.. మాకు అప్పగించండి.. అంటూ విశాఖలో ఓ స్వచ్ఛంద సంస్థ పిలుపునిచ్చింది. మాతృ దినోత్సవం సందర్భంగా పాతనగరంలో ఉన్న వివేకానంద స్వచ్ఛంద సంస్థలో మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించారు.
సృష్టిలో తల్లిని మించిన దైవం లేదని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు అన్నారు. మాతృమూర్తుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి భక్తితో.. పాద పూజలు చేశామని ఆయన తెలిపారు. నేడు సమాజంలో తల్లి గొప్పతనాన్ని పిల్లలు తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి తల్లులు ముందుంటారన్నారు.
అంతటి గొప్ప త్యాగమూర్తిని నేడు బిడ్డలు భారంగా భావించి వదిలించుకోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అటువంటి మాతృమూర్తులకు వివేకానంద ఆశ్రమం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమ్మను భారంగా భావిస్తే దయచేసి రోడ్లమీద వదిలేయవద్దని.. తమ ఆశ్రమానికి తీసుకు వచ్చి అప్పగించాలని కోరారు.
ఇదీ చదవండి: