విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. బీఆర్టీస్ రోడ్డు త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని కోరారు.
జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ, సచివాలయాల పనితీరు, పలు అంశాలపై ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలతో సంక్షేమ పథకాలు కొంతమంది ప్రజలకు చేరడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ఆ సమస్యలు రాకుండా చూడాలని మంత్రి కోరారు. భూకబ్జాలను అడ్డుకుంటున్నామన్నారు. విశాఖ మహానగర పరిధిలోని 98 వార్డులలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: