రాష్ట్ర పరిపాలన రాజధానికి కావలిసిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఏయూ లో క్రీడా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం రాజధాని అని ఎప్పటినుంచో చెబుతున్నట్టు గుర్తు చేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు.
విశాఖను పరిపాలన రాజధానిగా చేసినంత మాత్రాన అమరావతి, కర్నూలు ప్రాంతాలను పట్టించుకోకుండా ఉండే ప్రసక్తే లేదన్నారు. విశాఖను రాష్ట్ర రాజధానిగా కేంద్రం పరిగణించిన సంకేతాలు రావడం సంతోషకరమని చెప్పారు. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి.. తగిన శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: