విశాఖ నగరంలో మెట్రో మెయిన్ లైన్ పనులు జనవరిలోపు పూర్తి చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపిందని... మంత్రి బొత్స తెలిపారు. మెట్రో నిర్మాణంపై వీఎంఆర్డీఏలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... ముఖ్యమంత్రి జగన్‌తో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వరకు నిర్మాణంపై అధ్యయనం చేశామని బొత్స వివరించారు. విస్తరణలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. విశాఖ బీచ్‌కు ఎలాంటి భంగం కలగకుండా మెట్రో అనుసంధానం ప్రతిపాదన ఉన్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
ఇదీ చదవండి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష