విశాఖ ఉత్సవ్ నిర్వహణపై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న 'విశాఖ ఉత్సవ్'పై పర్యటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో పర్యటకశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా పర్యటకులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల్లో సాంస్క్రతిక కార్యక్రమాలు, ప్లవర్ షో, కార్నివాల్ నిర్వహించనున్నారు. ఇదీ చదవండి :
'స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలి'