విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా తనిఖీ వైద్య కేంద్రాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. అందులో వైద్య సిబ్బందిని పెంచాలని డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు. ఎంబీబీఎస్ వైద్యులను కాకుండా ఎండీలను నియమించాలని సూచించారు. స్వదేశీ, విదేశీ ప్రయాణికులు అందరినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
ఇవీ చదవండి.. కరోనా కారణంగా నూకాలమ్మ జాతర నిలిపివేత