ETV Bharat / city

మావోయిస్టుల దుశ్చర్య... ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులకు సమాచారమిస్తున్నాడనే అనుమానంతో ఓ అమాయక గిరిజన యువకుడిని దారుణంగా కాల్చి చంపారు.

author img

By

Published : Jun 29, 2019, 6:55 AM IST

మావోయిస్టుల దుశ్చర్య
మావోయిస్టుల దుశ్చర్య

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన యువకుడిని కాల్చి చంపారు. మృతదేహం వద్ద పెదబయలు ఏరియా మావోయిస్ట్ కమిటీ పేరిట లేఖ పడవేశారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెల కోట పంచాయతీ బెంజంగి గ్రామానికి చెందిన కొర్ర సత్తిబాబు... కొన్ని నెలలుగా పోలీసులకు సహకరిస్తూ తమకు నష్టం కలిగిస్తున్నాడనే కారణంతో చంపినట్లు అందులో పేర్కొన్నారు. అంతేకాక మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులను మావోయిస్టు దళ సభ్యుడు పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వెల్లడించారు. తీరు మార్చుకోనందున చంపేశామని లేఖలో వివరించారు. సత్తిబాబుకు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. మృతదేహాన్ని పెదబయలు మార్చురీకి అధికారులు తరలించారు. అయితే అతను ఇన్​ఫార్మర్ కాదని ఎస్సై సత్తిబాబు తెలిపారు.

New Delhi, Jun 28 (ANI): Union Home Minister Amit Shah on Friday criticised the Congress party for its historic "blunder"in Jammu and Kashmir (J-K), and said Jawahar Lal Nehru gave away portion of J-K to Pakistan without taking then home minister Sardar Patel in confidence. Shah added that had Nehru taken Patel in confidence then PoK would have been in India's hands, and the country would not have to fight for it. Shah also said that terrorism would not have taken its form in India if India was ruling over an undivided J-K.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.