ETV Bharat / city

తెదేపా నేతలకు ఫోన్ సందేశాల ద్వారా బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు నాయకులకు ఫోన్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపుతున్న వ్యక్తిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.

man-arrested-for-threatening-some-leaders-via-phone-messages
తెదేపానేతలకు ఫోన్ సందేశాల ద్వారా బెదరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Oct 25, 2020, 3:07 PM IST

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు నేతలకు ఫోన్ ద్వారా​ బెదిరింపు సందేశాలు పంపిన విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తాతారావు బీటెక్ పూర్తి చేసి ప్రముఖ నాయకులకు ఇలా ఫోన్​తో​ బెదిరింపు సందేశాలు పంపుతూ ఉంటాడని నర్సీపట్నం ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే.... తెదేపా సీనియర్ నేత అయ్యన్నతో పాటు పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రేవంత్ రెడ్డిలతో పాటు పలువురిని ఫోన్ సందేశాల ద్వారా బెదిరించినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు.

తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని చరవాణి ఆధారంగా గతంలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెయిల్​పై వచ్చిన తర్వాత అతను...మాజీ మంత్రి అయ్యన్నకు గత నెల రెండో వారంలో బెదిరింపు మెసేజ్​లు పంపడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సందేశంలో అయ్యన్నను చంపేసి ప్రయత్నం జరుగుతోందని సమాచారం ఉందని ఆ యువకుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు. ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు నర్సీపట్నం పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అవయవ దానంతో నలుగురి ప్రాణాలు నిలిపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.