ETV Bharat / city

మెున్న సబ్బంహరి ఇల్లు...నేడు గీతం వర్సిటీ: నారా లోకేశ్

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయకక్షకు పరాకాష్టని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh comments On Getham university Issue
నారా లోకేశ్
author img

By

Published : Oct 24, 2020, 12:29 PM IST

కూల్చివేతల జగన్ రాక్షసానందానికి అడ్డూఅదుపు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలతో కిక్ రావాల్సింది పోయి విధ్వంసం కిక్ ఇస్తోందని మండిపడ్డారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం విశ్వవిద్యాలయ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్షకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గీతం ఆసుపత్రి కరోనా కష్టకాలంలో సేవలు అందించిందని గుర్తు చేశారు.

ఎన్నో ఏళ్లుగా విద్యా బుద్ధులు నేర్పుతూ ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం సంస్థపై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోందని ఆక్షేపించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారన్న లోకేశ్​..., మొన్న సబ్బం హరి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీనే అందుకు నిదర్శనమన్నారు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డని... విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే అయన లక్ష్యమని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.