ETV Bharat / city

విశాఖ ఘటన: విచారణకు ఎల్జీ దక్షిణ కొరియా బృందం - lg polymers incident

గ్యాస్ లీకేజ్ ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయమైన దక్షిణకొరియా నుంచి ఓ బృందం విశాఖకు చేరింది.

LG Chem
LG Chem
author img

By

Published : May 13, 2020, 5:15 PM IST

గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం...ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులతో పాటు బాధితులకు పరిహారం వంటి అంశాలపై ఆరా తీయనుంది.

ప్రధాన కార్యాలయమైన సియోల్​ నుంచి 8 మందితో కూడిన బృందాన్ని ఘటన స్థలానికి పంపాం. ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు బాధితులకు పునరావాస సహాయం అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పని చేస్తారు.

- ఎలీజీ పాలిమర్స్ యూనిట్, ఇండియా

ఉత్పత్తి, పర్యావరణ, భద్రత రంగాల్లోని నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులను తమ బృందం కలుస్తుందని స్పష్టం చేసింది. అందించాల్సిన సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి :

విషవాయువు తరలించేందుకు మరో మూడు రోజులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.