Drugs caught at Visakha: విశాఖలో మరోసారి మాదక ద్రవ్యాల సరఫరా కలకలం రేపాయి. హైదరాబాద్ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్న యువతిని ఎన్ఏడీ జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురికి గోవాలో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య ద్వారా విశాఖలో ఉన్న హేమంత్‌కు మాదక ద్రవ్యాలు పంపించింది. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు.. ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఇద్దరినీ పట్టుకున్నారు. పృథ్వీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 18 ఎమ్ఎమ్డీఏ పిల్స్, 2 ఎమ్ఎమ్డీఏ క్లిస్టర్ పౌడర్ , 20వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!