ETV Bharat / city

Visakha Steel: ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు: కార్మిక సంఘాలు - స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ..ఇవాళ విశాఖ బంద్

Visakha Steel: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ప్రకటించిన విశాఖ బంద్ కొనసాగుతోంది. స్టీల్​ ప్లాంట్​ మెయిన్​ గేట్​ వద్ద కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్​పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Visakha Steel
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ..ఇవాళ విశాఖ బంద్
author img

By

Published : Mar 28, 2022, 6:46 AM IST

Updated : Mar 28, 2022, 11:37 AM IST

Visakha Steel: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ప్రకటించిన విశాఖ బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్​పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘ నాయకులు తేల్చి చెప్పారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన ద్వారం వద్ద తోపులాట జరిగింది. స్టీల్‌ప్లాంట్‌ వద్ద పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసున్నారు. విశాఖ ఆటోమోటివ్‌ కూడలిలో వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష నేతలు సహా పలు కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దిలపాలెంలో కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి నిరసన చేపట్టింది. సీపీఎం, ఏఐటీయూసీ నాయకుల అరెస్టు చేసి ఎంవీ పోలీస్​స్టేషన్‌కు తరలించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద సీఐటియూ, ఏఐటిసి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను ఆపడానికి ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

త్వరలో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకుని దిల్లీ వెళ్లి పోరాట పటిమ చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక నేతలు తెలిపారు. కేంద్రం మళ్లీ పార్లమెంట్​లో 'విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తాం' అనే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు జరగబోయే సమ్మెలో విశాఖ జిల్లాలో పది లక్షల మంది కార్మికులు పాల్గొంటారని కార్మిక సంఘ నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి: వైకాపా పాలనలో రైతులకు మొండిచేయి.. ఇప్పటికీ అందని 2018 ఖరీఫ్‌ పెట్టుబడి రాయితీ

Last Updated : Mar 28, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.