విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. నేటి ఉదయం ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనాన్ని కార్మిక నేతలు ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు చేతబట్టి కార్మిక నేతలు నిరసన వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే కార్మికులను అడ్డుకుని నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కార్మికుల ఆందోళనతో దాదాపు రెండు కిలో మీటర్ల మేర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: