విశాఖకు చెందిన రాకేష్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువకులను మోసగించాడు. సుమారు రూ. కోటి 50 లక్షలకుపైగా అతను వసూలు చేశాడు. గుంటూరుకు చెందిన కొందరు నిరుద్యోగుల నుంచి కూడా అతను డబ్బు వసూలు చేశాడు. బాధితులు అతనిపై గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతని నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పించేందుకు కొందరు బంధువులు మధ్యవర్తిగా ఉన్నారు. రాకేష్ డబ్బులు చెల్లించకపోవడంతో నిరుద్యోగులు మధ్యవర్తులపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో మధ్యవర్తులు నిరుద్యోగుల ద్వారా రాకేష్‍ను పోలీసులకు అప్పగించేందుకు తీసుకెళ్తుండగా తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి: చింతపల్లి@9.2 డిగ్రీలు