విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకేజీ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. పరిశ్రమ యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అందుకే వేరే ఏ కమిటీని నియమించినా విశాఖ ఘటనలో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. న్యాయవిచారణే సరైన మార్గమని కన్నా లేఖలో అభిప్రాయపడ్డారు.
గ్యాస్ ప్రభావానికి గురైన వారు తమ జీవితకాలం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా పేదలేనని .. ఆ ఖర్చు భరించటం కష్టమని అన్నారు. వారందరికీ ప్రత్యేక ఆరోగ్య కార్డులు మంజూరు చేసి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని లేఖలో కన్నా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: