జనతా కర్ఫ్యూ.. విశాఖలో బోసిపోయిన రహదారులు - janatha curfew news
కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించి.. ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. విశాఖలో ఉదయం నుంచే ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. రహదారులన్నీ బోసిపోయాయి. బీచ్‌రోడ్డులో సైతం బంద్ వాతావరణం కనిపిస్తోంది. అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ బంద్ అయ్యాయి. విశాఖలో కర్ఫ్యూ పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!