విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష, కార్మిక, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల నేతలు, ప్రజాసంఘాలు ఇందులో పాల్గొన్నారు. కూర్మన్నపాలెం గేట్ వద్ద 'విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి' నేతృత్వంలో దీక్షలు చేస్తూనే.. ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: