విశాఖలో పలు ప్రభుత్వ వైద్య కేంద్రాలను జిల్లా నోడల్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల పరిశీలించారు. పెదవాల్తేర్ లోని రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. 30 పడకలతో కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
ఈనెల 22 నుంచి రాణి చంద్రమణి దేవి ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆసుపత్రి అవసరాల కోసం 2 అంబులెన్స్‌లు సమకూరుస్తున్నామన్నారు. రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించి.. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్యం వివరాలు తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: