ETV Bharat / city

భారత్ ఎఫెక్ట్: గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు - గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు న్యూస్

మారుమూల కొండల్లో ఏళ్ల తరబడి జీవిస్తూ.. ప్రభుత్వ లెక్కల్లో లేని గిరిజనుల కష్టాలపై ఈటీవీ భారత్​లో వచ్చిన 'బ్రతికి ఉన్నా లేనట్లే' అనే కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. రెండు నెలల కిందట ఈటీవీ భారత్​ సహకారంతో ఆ గ్రామంలో పర్యటించి అన్ని ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా కృషి చేస్తానని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు...గిరిజనులకు ఆధార్ కార్డులు అందజేశారు.

గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు
గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు
author img

By

Published : Dec 5, 2020, 7:56 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కేంద్రానికి సమీపంలో కొండల్లో విసిరేసిన కుగ్రామం బంధలపనుకు. ఈ గ్రామం ప్రభుత్వ లెక్కల్లో ఉన్నప్పటికీ...అక్కడి గిరిజనులు ఏ రికార్డులలోనూ లేరు. విద్యుత్, మంచినీరు, రహదారి వంటి మౌలిక సదుపాయాలకు వారు ఆమడ దూరం. రెండు నెలల కిందట వీరి సమస్యను ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన అధికారులు...ఆ గ్రామంలో పర్యటించి ఆధార్, రేషన్, ఓటర్​ కార్డులు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు.

స్థానిక ఎంపీడీవో వెంకన్నబాబు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ప్రస్తుతం ఆధార్​ కార్డులు మంజూరు చేయించారు. త్వరలో రేషన్, ఓటర్ కార్డులతో పాటు ప్రభుత్వ ఇళ్లు, వ్యవసాయ భూముల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. ఎంపీడీవో తన సొంత ఖర్చులతో ఆధారు కార్డులు ఇప్పించటం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసి...తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ఈటీవీ భారత్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి

కొండపల్లి బొమ్మలు అమ్ముడు పోవటం లేదు ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.