వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వేడుకల నిర్వహణకు విశాఖ నగరంలో అధికారులు స్థల పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు పరిశీలించారు. విశాఖ బీచ్‌ను పరిశీలించి... వేడుకలు జరిగే ప్రదేశాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండీ...