విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలనన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగర సీపీ ఆర్కే మీనాలు కమిటీలో ఉన్నారు.
హైపవర్ కమిటీ మూడు రోజులపాటు విశాఖ నగరంలోనే బస చేయనుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర నిపుణులు ఆచార్య బాలప్రసాద్, ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య డీవీ ప్రసాద్‌లతో కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై వివిధ కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. నిపుణులతో అనేక అంశాలను చర్చించనుంది.
సాయంత్రం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సభ్యులతో హైపవర్ కమిటీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనుంది. కమిటీ ప్రతినిధులు రాజకీయ, పర్యావరణవేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజల తరుపున ప్రతినిధులతో కమిటీ చర్చించనుంది.
ఇదీ చదవండి: అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయిందట!