ETV Bharat / city

అభ్యంతరాలున్నా హెటిరోకు భూములు! - విశాఖలో హెటిరో భూముల విస్తరణ

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం హెటిరో మందుల పరిశ్రమ ఆక్రమణలో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు పావులు కదుపుతున్న వైనం స్థానిక రైతులకు ఆందోళన కలిగిస్తోంది. నల్లమట్టిపాలెం, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల ప్రజలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు అదనంగా భూములను కేటాయిస్తే తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి కూడా ఉండదని ఆందోళన చెందుతున్నారు. పశువుల బీళ్లు కూడా మిగలవని వారు రెవెన్యూ అధికారులకూ విన్నవించారు. అయినా అధికారులు హెటిరోకు అనుకూలంగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారని సమాచారం.

hetirock lands
hetirock lands
author img

By

Published : Aug 27, 2020, 7:38 AM IST

హెటిరో విస్తరణకు 2016లో తమ కంపెనీని అనుకుని ఉన్న 108 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విస్తరణకు నాటి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఆ సంస్థకు 108 ఎకరాల్లో 81.03 ఎకరాలను అప్పగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్‌ కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నప్పుడే గ్రామసభలు జరిపించి పరిశ్రమకు అనుకూలంగా తీర్మానాలు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయిదేళ్ల క్రితం నక్కపల్లి ప్రాంతంలో విశాఖ- చెన్నై పారిశ్రామిక నడవా కోసం భూములు సేకరించినప్పుడు జిరాయితీ భూములకు ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలుకుతోంది. అయినా రూ.18 లక్షల చొప్పునే ఈ 108 ఎకరాలను కేటాయించాలని హెటిరో కోరుతున్నట్లు తెలిసింది.

ప్రభుత్వానికి నివేదిక పంపలేదు

హెటిరో కంపెనీ విస్తరణపై నివేదికను ప్రభుత్వానికి పంపించలేదు. ఆ భూములకు ఎంత ధర చెల్లించాలనేది నిర్ణయించలేదు. సీసీఎల్‌ఏ కమిషనర్‌స్థాయిలో భూముల ధరలు నిర్ణయిస్తారు. వాటికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తరువాత భూకేటాయింపు జరుగుతుంది. - వేణుగోపాలరెడ్డి, సంయుక్త కలెక్టర్‌, విశాఖపట్నం.

ఇదీ చదవండి: సర్వత్రా ఉత్కంఠ.. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.