ETV Bharat / city

విశాఖ మన్యంలో భారీ వర్షం... కొట్టుకుపోయిన లారీ - విశాఖలో భారీ వర్షం

విశాఖ మన్యంలో భారీ వర్షం కురుస్తోంది. ముంచంగిపుట్టు మండలంలోని వివిధ ప్రాంతాల్లో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. వరద ప్రవాహంలో ఓ మినిలారీ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.

heavy rain in viskaha dst tribal area
heavy rain in viskaha dst tribal area
author img

By

Published : Aug 15, 2020, 5:26 PM IST

Updated : Aug 17, 2020, 2:34 PM IST

ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఏవోబిలో గల మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణ, ఛత్తీస్​ఘఢ్ వెళ్ళే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. కంగురుకొండ సమీపంలో రహదారి మీద నుంచి వరద ప్రవాహం వలన రాకపోకలు నిలిచిపోయాయి. ఒక మినీ లారీ వరద మధ్యలో ప్రయాణిస్తూ నీటిలో కొట్టుకుపోయిన ఘటన వాహన చోదకులుకు భయాందోళనకులకు గురిచేసింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు.

విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంచంగిపుట్టు మండలంలో కురుస్తున్న వర్షాలకు బిరిగూడ, ముంతగుమ్మి, కొజిరిగుడ గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం గేదె గడ్డ , జాము గుడ, ఇంజరి ఆనుకుని ఉన్న గడ్డలు పొంగి ప్రవహించటంతో రాకపోకలు సాగించటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

జి.మాడుగుల మండలం కుమ్మడిసింగి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ఆ పంచాయితీలో రాకపోకలు నిలిచిపోయాయి. ముంచింగిపుట్టు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.

విశాఖ మన్యంలో భారీ వర్షం..పొంగిపొర్లుతున్న వాగులు

ఇదీ చూడండి

గోదావరి వరదపై సీఎం సమీక్ష

Last Updated : Aug 17, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.