ETV Bharat / city

సింహాద్రి అప్పన్న సేవలో హరియాణా సీఎం ఖట్టర్

author img

By

Published : Apr 17, 2022, 7:35 PM IST

సింహాద్రి అప్పన్న స్వామిని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్ దర్శించుకున్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

సింహాద్రి అప్పన్న సేవలో హరియాణా సీఎం ఖట్టర్
సింహాద్రి అప్పన్న సేవలో హరియాణా సీఎం ఖట్టర్

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శాననంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన పండితులు.. వేదాశీర్వచనం చేశారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సీఎం ఖట్టర్ సందర్శించారు. పీఠంలోని రాజశ్యామల అమ్మవారు, వనదుర్గ, దాసాంజేనయ స్వామి, దక్షిణమూర్తి, షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

పీఠం చరిత్ర, రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి విని ఇక్కడకు వచ్చానని స్వామీజీతో ఖట్టర్ చెప్పారు. పీఠాన్ని సందర్శించటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాజశ్యామల అమ్మవారి దర్శనభాగ్యం మరువలేని జ్ఞాపకం అన్నారు. అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. అనంతరం ఖట్టర్​ను పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ఆలయాల సందర్శనకు తీసుకెళ్లారు. ధర్మ పరిరక్షణ కోసం విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న కృషిని సీఎం ఖట్టర్​కు వివరించారు. హరియాణా ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. అక్కడ కూడా ఆశ్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఖట్టర్​కు శంకరాచార్య విగ్రహాన్ని స్వామీజీ బహూకరించారు.

ఇదీ చదవండి: 'భారత్​లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.