విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి రావడానికి కిరాయికి కూడా డబ్బుల్లేని దయనీయస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా.. జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రతి నెల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన పని భారం పెంచుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని.. ఆ మేరకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: