ETV Bharat / city

కనీస రక్షణ పరికరాలు లేవు: పారిశుద్ధ్య కార్మికులు - visakha latest news

ప్రభుత్వ వైఖరి పట్ల విశాఖ నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస రక్షణ పరికరాలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

GVMC Sanitation workers intolerance on government
కనీస రక్షణ పరికరాలు లేవు: పారిశుద్ధ్య కార్మికులు
author img

By

Published : Apr 5, 2020, 7:15 PM IST

కనీస రక్షణ పరికరాలు లేవు: పారిశుద్ధ్య కార్మికులు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎంతో శ్రమించి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర శివార్ల నుంచి వచ్చే తమకు రవాణా సదుపాయం లేదని పారిశుద్ధ్య కార్మికులంటున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుపుతున్నారు. ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తే కానీ ఇంటికి చేరుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు.

అత్యవసర సేవలు అందిస్తున్న ఇతర విభాగాల సిబ్బంది పట్ల నగరపాలక సంస్థ అధికారులు చూపే శ్రద్ధ... తమపై చూపడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉదయం అల్పాహారం, భోజనం ఎవరైనా దాతలు ఇస్తేనే తినే పరిస్థితి ఉందంటున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరించి, పొడి చెత్త కేంద్రానికి తరలించే కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి 4 నెలలుగా జీతాలు లేవు. మాస్కులు, గ్లౌజులు వంటి రక్షణ సౌకర్యాలు లేవు. ప్రభుత్వం స్పందించి తమకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.