ETV Bharat / city

కేవలం అనుమతి లేేని కట్టడాలనే తొలగించాం: జీవీఎంసీ - హిడెన్ స్ప్రౌట్ స్కూల్ కూల్చివేతలు

విశాఖలోని హిడెన్ స్ప్రౌట్ స్కూల్​లో కూల్చివేతలపై జీవీఎంసీ వివరణ ఇచ్చింది. నిర్వాహకులు అనుమతి లేని చోట చేపట్టిన తాత్కాలిక కట్టడాలను మాత్రమే తాము కూల్చివేసినట్లు ప్రకటించింది. దీనివల్ల స్కూలుకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు.

gvmc on demolitions
కేవలం అనుమతి లేేని కట్టడాలనే తొలగించాం
author img

By

Published : Jun 7, 2021, 3:57 PM IST

Updated : Jun 7, 2021, 5:07 PM IST

విశాఖ ఎంవీపీ కాలనీలో మానసిక, దివ్యాంగుల ప్రత్యేక స్కూల్ హిడెన్ స్ప్రౌట్ కూల్చివేత వార్తలను మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఖండించింది. హిడెన్ స్ప్రౌట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావుకు దివ్యాంగుల ఆశ్రమ నిర్వహణకోసం కేవలం.. రూ. 3 వేలకే వసతికి సరిపడే స్థలాన్ని ఇచ్చి మిగిలిన ప్రాంతాన్ని ఆటస్థలంగా వాడుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసిస్టెంట్ టౌన్​ ప్లానింగ్ అధికారి పేరిట ప్రకటన చేసారు.

అనుమతి లేని వాటినే..

2013కే అద్దె గడువు ముగిసినట్లు అందులో తెలిపారు. గత 7 సంవత్సరాలుగా మైదాన స్థలంలో అనధికార నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొంది. లీజులో లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ముందస్తుగా లీజు దారులకు తెలిపనట్లు జీవీఎంసీ తెలిపింది. కానీ.. వ్యవస్థాపకులు సమాచారం లేకుండా, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల.. వాటిని మాత్రమే తొలగించినట్లు స్పషం చేసింది. కేవలం అనుమతి లేని నిర్మాణాలను కూల్చినట్లు.. స్కూల్, కార్యాలయ భవనాలకు విఘాతం కలిగించలేదని జీవీఎంసీ ప్రకటనలో తెలిపింది.

ఇవీ చదవండి:

"కొవిడ్​ సమయంలో లిక్కర్​ ప్రజలకు టానిక్​​"

దివ్యాంగుల ఆశ్రమంలోని కట్టడాల కూల్చివేతపై ఆందోళన

Last Updated : Jun 7, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.