విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఆరు నెలల్లోగా జరపాలని ఈనెల 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు 2012లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... ఎన్నికలు జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో గోపాల్ రెడ్డి వేసిన పిల్‌ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.
హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్ గోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది విశాఖ ప్రజల విజయమని గోపాల్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న శాసనసభ్యులే కారణమని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే జీవీఎంసీ ఎన్నికలు జరపకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా హక్కులకు తీవ్ర భంగం కలిగించారని అన్నారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించకపోతే మళ్లీ న్యాయపరమైన పోరాటం చేస్తానని గోపాల్ రెడ్డి వెల్లడించారు
ఇదీ చదవండి