ETV Bharat / city

కార్పోరేషన్ ముఖ్య అధికారులతో జీవీఎంసీ కమిషనర్ సమీక్ష - కార్పోరేషన్ ముఖ్య అధికారులతో జీవీఎంసీ కమిషనర్ సమీక్ష

మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని జీవీఎంసీ కమిషనర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సృజన మేయర్​తో నగర అభివృద్ధిపై చర్చించారు. నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని మేయర్​కు వివరించారు. అనంతరం కమిషనర్ సృజన కార్పోరేషన్ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Gvmc Commissioner
Gvmc Commissioner
author img

By

Published : Mar 23, 2021, 7:01 AM IST

మహా విశాఖ నగరపాలక సంస్థ విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని మేయరు గొలగాని హరి వెంకట కుమారి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనకు సూచించారు. సోమవారం మేయరును కమిషనర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవీఎంసీకి సంబంధించి వివరాలను తెలియజేశారు. రెవెన్యూ, వ్యయం, ప్రాజెక్టులు, మంచినీటి సరఫరాలపై ఇరువురూ చర్చించుకున్నారు. విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చర్యలను చేపట్టాల్సి ఉందని మేయరు తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సన్నద్ధం కావాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కమిషనర్‌ స్పందిస్తూ, వనరుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన కార్పోరేషన్ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సారి అధికారులతో సమావేశమైన సృజన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతిని ఆరా తీశారు. మనబడి నాడు-నేడు సహా స్మార్ట్ సిటీ పనులు , స్వచ్ఛ సర్వేక్షన్ అంశాలపై చర్చించారు. వేసవి నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత విభాగ అధికారికి సూచనలు చేశారు. టిడ్కో హౌసింగ్ రిజిస్ట్రేషన్లు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీల ద్వారా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, సన్యాసి రావు, ఎ.వి. రమణి, జీవీఎంసీ ముఖ్య వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఫాస్టాగ్‌ ద్వారా రోజుకు రూ.100 కోట్ల వసూళ్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.