విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఖాళీగా ఉన్న జి+4 భవనాన్ని ఆర్టీసీ పరిపాలన భవనంగా మార్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఈ భవనాన్ని జీవీఎస్‌సీసీఎల్ (గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్) అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఇటీవల ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. కొత్తగా రంగులేసి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఆర్టీసీ పరిపాలన భవనం ఉండగా, దాన్ని ద్వారకా బస్‌స్టేషన్ భవనంలోకి మార్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: నేడు హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి ప్రమాణస్వీకారం