Dr Challa Krishnaveer Abhishek: ఆంధ్ర యూనివర్సిటీ గాంధీయన్ స్టడీస్ సెంటర్లో గాంధీజీ పరిశోధకుడు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన "మహాత్మా బాపుసింగ - భయం, ద్వేషం లేని జీవితం" పుస్తకాన్ని జర్మనీలోని గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్టియన్ బార్టోల్ఫ్ విడుదల చేశారు. మహాత్మాగాంధీపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం చేసిన బార్టోల్ఫ్.. గాంధేయ ఆలోచనలు తూర్పు, పాశ్చాత్య సిద్ధాంతాల కలయిక అని అన్నారు. హెన్రీ డేవిడ్ థోరో, జాన్ రస్కిన్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, సోక్రటిస్ మరియు లియో టాల్స్టాయ్ వంటి పాశ్చాత్య ఆలోచనాపరులు గాంధీని ఎంతగానో ప్రభావితం చేశారని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ సిద్ధాంతాలను యువతలో ప్రచారం చేయాలని ఇటీవలే అధికార భాషా సంఘం చైర్మన్గా రాజీనామా చేసిన ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గాంధీ కింగ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ తన శక్తివంతమైన అహింస, శాంతి ద్వారా ప్రపంచ దేశాలను ప్రభావితం చేశారని అన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. కిషోర్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీలోని గాంధేయ అధ్యయన కేంద్రం మహాత్మాగాంధీ ఆలోచనలపై ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
ఇవీ చదవండి: