ETV Bharat / city

కుటుంబాన్ని బలితీసుకున్న అప్పుల బాధ - విశాఖ జిల్లా నేర వార్తలు

Four commit suicide at a lodge near Visakhapatnam RTC Complex
కుటుంబాన్ని బలితీసుకున్న అప్పుల బాధ
author img

By

Published : Sep 9, 2020, 9:20 PM IST

Updated : Sep 10, 2020, 6:00 AM IST

21:16 September 09

కుటుంబాన్ని బలితీసుకున్న అప్పుల బాధ

అప్పులు... రాకాసిలా మారాయి... ఎటు వెళ్లినా వెంటాడాయి... కళ్లు మూస్తే కలల రూపంలో... కళ్లు తెరిస్తే కొండలా పేరుకుపోయిన వడ్డీ రూపంలో! ఆ బాధ ముందు మరో ఆలోచనేదీ రాలేదేమో! రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు జీవితం పంచుకున్న భార్య...తాను ఈ లోకం నుంచి శాశ్వతంగా వదిలివెళ్లిపోవాలనే ఆ ఇంటి యజమాని నిర్ణయం నలుగురి ప్రాణాలు తీసింది! చివరి వారం రోజులు... కుటుంబ  సభ్యులంతా నగరంలోనే ఉన్నారు పిల్లలిద్దరు... దంపతులు హోటల్‌లో ఓ గదిలో గడిపారు! ఇంతలో ...  మృత్యువు అప్పుల రూపంలో  తరుముకొచ్చింది నలుగురి ప్రాణాలు మింగేసింది! కలకలం రేపిన ఈ ఘటనలో పెందుర్తి సమీపంలోని బంధంవానిపాలెం గ్రామానికి చెందిన అప్పలరాజు(32) కుటుంబం ప్రాణాలు కోల్పోయింది! ద్వారకా పోలీసు స్టేషన్‌ అధికారులు, మృతుల కుటుంబీకులు తెలియజేసిన వివరాలివి...
చేసిన అప్పులు చెల్లించలేక అప్పలరాజు ఏడాదిగా రహస్య జీవితం గడుపుతున్నారు. ఇతను ఇంటర్‌ వరకు చదువుకున్నారు.. ఆ తరువాత 'రియల్‌ ఎస్టేట్‌' వ్యాపారంలోకి దిగారు. కొంత కాలం పాటు వ్యాపారం బాగానే సాగింది. భారీగానే ఆదాయం సంపాదించారు. విజయనగరానికి చెందిన మానస(26)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సాత్విక్‌(6), కీర్తి (5). అయితే కొంత కాలంగా అప్పులు చేయడం ప్రారంభించారు. ఎందుకు ఖర్చుపెడుతున్నాడో ఎవరికీ తెలియకపోయినా...గతంలో బాగా సంపాదించిన నేపథ్యంలో బంధువులు, గ్రామస్థులు అప్పులిచ్చారు. ఆ భారం దాదాపు రూ. కోటి వరకూ ఉన్నట్లు సమాచారం. రుణదాతలకు వడ్డీలు కడుతూ చాలా కాలం నెట్టుకొచ్చారు. వడ్డీల భారం ఎక్కువ కావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఈ కారణంగానే అప్పల రాజు తండ్రి సన్నిబాబు గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం అప్పలరాజు గ్రామంలో నుంచి వెళ్లిపోయారు. సంవత్సర కాలంగా రహస్య జీవితం గడుపుతున్నారు. అప్పుల వాళ్లకు తెలిస్తే ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో అత్యంత సన్నిహితులకు మాత్రమే తన ఆచూకీ చెప్పేవారు.. ఏమైనా పనులు ఉంటే వారినే కలుస్తూ... వారితోనే మాట్లాడేవారు. ఎవరినీ ఎక్కువగా కలిసేవారు కాదు. తాజాగా గత నెల 20వ తేదీ నుంచి విశాఖ బస్టాండు ఎదురుగా ఉన్న ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు.  ఒక్కోసారి బయటకు వెళ్లి భోజనం తెచ్చుకుని గదిలోనే తినేవాడని హోటల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆ ముగ్గురూ ఎలా చనిపోయారో?
ఈ నెల రెండో తేదీన భార్యా, పిల్లలు కూడా హోటల్‌కు వచ్చారు. వారందరితో బుధవారం మధ్యాహ్నం వరకు అప్పలరాజు గడిపారు. సాయంత్రం ఐదు గంటలకు హోటల్‌ సిబ్బంది గది తలుపులు కొడుతుంటే ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అప్పలరాజు ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయి ఉన్నారు.  అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పలరాజు భార్య, పిల్లలు ఎలా చనిపోయారన్న విషయంపై పోలీసులకు స్పష్టత రావడంలేదు. తొలుత 'ముఖాలపై దిండుతో అదిమి గాలి ఆడకుండా చేసి పిల్లలిద్దరినీ చంపి... ఆ తరువాత మానస ఉరివేసుకోగా...ఆఖరున అప్పలరాజు ఉరివేసుకుని చనిపోయి ఉండొచ్చు' అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. శవపరీక్ష చేయిస్తేగానీ వారు ఎలా చనిపోయిందీ నిర్ధారించలేమని ద్వారకా స్టేషన్‌ సీఐ అప్పారావు వెల్లడించారు. అప్పులిచ్చిన వారి పేర్లు ఆత్మహత్య లేఖలో రాయలేదని వివరించారు. రూ.కోటికి పైగా అప్పులున్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని వెల్లడించారు. అప్పులపాలై ఆస్తులు కూడా చాలా వరకు విక్రయించేశారని, అతని తల్లి కూలి పనులు చేసుకుంటూ ఊళ్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు.
కన్నీరుమున్నీరైన సోదరుడు
అప్పలరాజు కుటుంబ సభ్యులు మృతి విషయం తెలుసుకున్న ఆయన సోదరుడు కోటి, మరికొందరు గ్రామస్థులు బుధవారం రాత్రి లాడ్జి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యాడు. ఒకేసారి నలుగురు కుటుంబసభ్యులు మృత్యువాత పడటంతో సోదరుడు రోదించాడు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపారు. హోటల్లోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.

ఇదీ చదవండీ... 24 గంటలు.. 10,418 కేసులు.. 74 మరణాలు

Last Updated : Sep 10, 2020, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.