Fishermen protest: విశాఖ పోర్టు ట్రస్టు జీసీబీ గేట్ వద్ద మత్స్యకారులు నిరసన చేపట్టారు. పోర్టు నిర్ణయాల వల్ల ఇబ్బంది కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ఉపయోగపడే స్థలాన్ని పోర్టు తీసుకోవాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 2002లో విశాఖ కంటైనర్ టెర్మినల్ పోర్టు లిమిటెడ్ సమయంలో మత్స్య కారుల భూములు తీసుకున్నారన్నారు. కానీ ఇప్పటివరకూ ఉద్యోగాలు ఇవ్వలేదని వాపోయారు. పోర్టు నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 424 మంది తమ భూమిని పోర్టు నిర్మాణ సమయంలో ఇస్తే.. కనీసం కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ పోస్టులు కూడా ఇవ్వకుండా మత్స్యకారులను బతుకులతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ పోర్టు ట్రస్టు జీసీబీ గేట్ వద్ద మత్స్యకారుల నిరసన - విశాఖ పోర్టు లేటెస్ట్ అప్డేట్స్
Fishermen protest: మత్స్యకారులకు ఉపయోగపడే స్థలాన్ని పోర్టు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ పోర్టు ట్రస్టు జీసీబీ గేట్ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. పోర్టు నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.