భూ సమీకరణ వ్యతిరేకిస్తున్న విశాఖ రైతులు- సభలు బహిష్కరణ - విశాఖలో భూ సమీకరణ
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునివలసలో భూ సమీకరణ సభ అర్థాంతరంగా ఆగిపోయింది. రైతులు భూ సమీకరణ సభను బహిష్కరించారు. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. 173 సర్వేనెంబర్‌లో 34 మంది రైతుల నుంచి 37 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భూ సమీకరణ సభ ఏర్పాటు చేశారు. అధికారులు ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది.