విశాఖలోని ఇండియన్ బ్యాంక్ ద్వారకా నగర్ బ్రాంచ్ లో... గిల్టు నగల ఉదంతంలో సుమారు కోటి రూపాయల వరకు అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. తమ ప్రమేయం లేకుండా గిల్టు నగలు లోన్ లో పెట్టామని బ్యాంకు అధికారులు చెప్పడంపై... ఆవేదన చెందిన ఖాతాదారులు ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 21 మంది ఖాతాదారులకు బ్యాంకు అధికారులు వారికి నోటీసులు పంపించడంపై ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే.. బ్యాంక్ మేనేజర్ ఇప్పటివరకూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడాన్ని సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని వాటిని విలువ కట్టే ఉద్యోగి.. గోల్డ్ అప్రైజర్ గత ఏడాది మృతి చెందిన కారణంగా.. బ్యాంకు మేనేజర్ ఈ ఉదంతంపై ఓ కొలిక్కి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సోమవారం విశాఖకు వచ్చి... ఈ వ్యవహారంపై ఆరా తీయనున్నట్లు సమాచారం.
ఉదంతాన్ని.. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బ్యాంక్ మేనేజర్ పై.. ఉన్నతాధికారుల ఫిర్యాదు లేకుండా సమగ్ర దర్యాప్తు చేయలేమని చెప్తున్నారు.