విశాఖ జీవీఎంసీలోని గాంధీ బొమ్మ వద్ద.. ఐకాస నేతల రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్ సందర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గతంలో బాగానే ఉండేవారు కానీ ఇప్పడు మారిపోయారంటూ విమర్శించారు. పోరాడే శక్తి, దమ్ము ఆయనకు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న భాజపాను వదిలి.. ఉక్కు ఉద్యమంలో కలిసి పోరాడాలని కోరారు.
హైదరాబాద్‌లోనూ ఇదే తరహా ఉద్యమం ప్రారంభించనున్నట్లు హనుమంతరావు చెప్పారు. లేదంటే ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకూండా అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: