ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల తరఫున నిలవడం తెలుగుదేశం పార్టీ నైజమని పేర్కొన్నారు.
అనకాపల్లి జీవీఎంసీ జోన్లోని 84వ వార్డులో గెలుపొందిన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి మాదంశెట్టి చిన తల్లిని ఆయన అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు, పార్టీ తరఫున బరిలో నిలిచి పోరాడిన అభ్యర్థులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: