ETV Bharat / city

'గుడ్​టచ్​, బ్యాడ్​టచ్​పై అవగాహన పెంచుకోవాలి'

author img

By

Published : Nov 23, 2019, 10:38 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో... గుడ్​టచ్​, బ్యాడ్​టచ్​పై అందరిలో అవగాహన పెరగాలని నటి రకుల్​ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. పిల్లలతో తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడాలని సూచించారు.

rakul preeth singh
రకుల్ ప్రీత్​ సింగ్ ప్రసంగం

చిన్నతనం నుంచే గుడ్​టచ్, బ్యాడ్​ టచ్​పై పిల్లలకు అవగాహన కల్పించాలని... ప్రముఖ నటి రకుల్​ ప్రీత్ సింగ్ సూచించారు. చిన్నారులతో వారి తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. పాఠశాల చిన్నారులకు గుడ్​టచ్, బ్యాడ్​టచ్​పై అవగాహన కల్పిస్తూ... చేపట్టిన 555 కిలోమీటర్ల నడక ముగింపు కార్యక్రమం విశాఖలో జరిగింది.

పోర్టు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. మంచి కోసం నడవడం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని... ద వైజాగ్ 5ఎ.ఎం క్లబ్, రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం... నడకలో పాల్గొన్న 55 మందికి రకుల్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.