ఆలయాల్లో అర్చకులకు కల్పించిన వంశపారంపర్య హక్కులను అమలు చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ప్రభుత్వానికి సూచించారు. రిషికేష్ వెళ్లి చాతుర్మాస్య దీక్ష చేపట్టిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములను దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీమోహన్ కలిశారు. ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన మార్పులను స్వామి స్వరూపానందేంద్రకు వాణీమోహన్ వివరించారు.
ఈ సందర్భంగా అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని స్వామీజీ సూచించారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పూజలు, వ్రతాలు చేపట్టడం ద్వారా మంచి స్పందన రావడమే కాక.. ఆదాయం సైతం పెరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని స్వామీజీ సూచించారు.
ఇదీ చదవండి: