ETV Bharat / city

విశాఖలో ముగిసిన ఈ-బైక్​, గోకార్ట్​ల సందడి - విశాఖలో ముగిసిన ఈ-బైక్​, గోకార్ట్​ల సందడి

రయ్ రయ్ మంటూ దూసుకుపోయే కార్ట్ లు ఓవైపు.. చప్పుడు లేకుండా సర్రున పరుగులు పెట్టే బైక్ లు మరోవైపు. విద్యార్థుల్లో పర్యావరణహిత వాహనాలపై ఆసక్తిని పెంచడం... వాహనాల తయారీ నైపుణ్యంపై మెలకువలకు పదును పెట్టడమే లక్ష్యంగా జరిగిన ఈ-బైక్ ఉత్సవ్ యువతలో నూతనోత్సాహాన్ని తెచ్చింది. అయిదు రోజుల పాటు వేడకగా జరిగిన పోటీలు ఆదివారంతో ముగిశాయి.

విశాఖలో ముగిసిన ఈ-బైక్​, గోకార్ట్​ల సందడి
author img

By

Published : Sep 30, 2019, 7:07 AM IST

విశాఖకు చెందిన 'ఇమాజిన్ టు ఇన్నోవేట్' అనే సంస్థ నిర్వహించిన ఈ-బైక్ సీజన్ -3 వేడుకలు ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలకు పదునుపెట్టాయి. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు అనేక బృందాలుగా ఏర్పడి వివిధ ఆవిష్కరణలకు రూపమిచ్చారు. ఈ-బైక్​లు, గోకార్ట్​లు తీర్చిదిద్దారు. రఘు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమం అయిదు రోజుల పాటు సందడిగా సాగింది. విద్యార్థులు రూపొందించిన వాహనాలకు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలు యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
ప్రమాదానికి గురైతే క్షణాల్లో బంధువులకు మెసేజ్​
చిత్తూరు జిల్లా మదనపల్లి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ బైక్, గో కార్టింగ్ పోటీలకు విశాఖపట్నం వచ్చారు. తాము రూపొందించిన వినూత్న ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు.
ఈ-బైక్​ ప్రత్యేకతలు ఏంటి?
డ్రైవింగ్ లైసెన్స్​కు ఉండే చిప్ వినియోగించి మాత్రమే ఈ వాహనాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందని టీం లీడర్​ మోహన్​ తెలిపారు. దీని వల్ల వాహన చోరీని నివారించవచ్చన్నారు. అదేవిధంగా ప్రత్యేక డిటెక్షన్ సెన్సార్​లను ఇందులో పొందుపరిచారు. దీని వల్ల వాహనం ఎక్కడైనా ఒరిగితే, వెంటనే బంధువులకు, అంబులెన్సు వంటి వ్యవస్థలకు మెసేజ్​పంపి అప్రమత్తం చేసే ఏర్పాట్లు చేశారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సంకేతాలు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. 2 నెలలపాటు ఈ బృందం కష్టపడి ఈ-బైక్​ను లక్షా 10 వేల రూపాయల వ్యయంతో తయారుచేశారు. రానున్న కాలంలో ఈ వాహనాన్ని వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు వీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆటోమొబైల్ రంగంలో నూతన ఒరవడి సృష్టించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న యువ ఇంజినీర్ల ప్రతిభకు ఈ వేదిక పట్టం కట్టింది. రఘు కళాశాల ఎదురుగా ఉన్న ఫార్చూన్ హిల్స్ రహదారులపై ల్యాప్​లు ఏర్పాటు చేశారు. తాము తీర్చిదిద్దిన వాహనాలతో పోటీపడ్డారు. పర్యావరణహితమైన వాహనాలతో కొత్తరూపు, ఆవిష్కరణలు తీసుకువస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

విశాఖలో గోకార్టింగ్​ పోటీల్లో పర్యావరణహిత వాహనం

Intro:రైతుల రుణమాఫీ ను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం చేసిన జీవో దారుణమని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు ఎలమంచిలి కళ్యాణమండపం ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దుచేస్తూ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది నిదర్శనంగా మారిందన్నారు రానున్న ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధిస్తుంది అన్నారు జగన్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ ఏపీ10146

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.