విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. కాబట్టి కేవలం నీరు వెదజల్లే వాహనాలు కాదు... రసాయన ప్రమాదాల సమయంలో నివారించే ఫోమ్ వాహనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఫైర్ ఫైటింగ్ టీం ఉంది. మంటల్లోకి సురక్షితంగా వెళ్లి బాధితులను కాపాడే దుస్తులు ఉన్నాయి. ఇక విశాఖ పోర్ట్ ,హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, పరవాడ ఫార్మా, అచ్యుతాపురం పారిశ్రామికవాడలో ప్రత్యేకంగా సొంత అగ్నిమాపక వాహనాలు నిర్వహించుకుంటున్నాయి.
విపత్తుల సమయంలోనూ సేవలు..
అగ్నిమాపక వాహనాలకు ప్రాణం నీరు. ఆ నీటి వనరులు విశాఖలో సంవృద్ధిగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న నీటి వనరులతో పాటు మున్సిపల్ శాఖ మంచినీరు శుద్ధి చేసే కేంద్రాల వద్ద నుంచి కూడా నీరు పొందుతున్నారు. ఇక విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అరకు మినహాయించి అన్నిచోట్ల అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఇరవై కిలోమీటర్లకు అగ్నిమాపక సేవలు అందుతున్నాయి. కేవలం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా.. ప్రకృతి విపతుల సమయంలోనూ ఈ శాఖ సేవలు అందిస్తోంది.
మాక్ డ్రిల్స్ నిర్వహణ
పరిశ్రమల్లో ప్రమాదాలు చిన్నవి జరిగినా.. వాటి వల్ల వచ్చే నష్టం ఎక్కువే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మాక్‌డ్రిల్ నిర్వహించడం, ఆ కంపెనీలో కొంతమంది సిబ్బందికి అత్యవసర సమయంలో తీసుకునే జాగ్రత్తల కోసం ముందే తర్ఫీదు ఇవ్వటం జరుగుతోంది. అలాగే నిర్ణీత సమయానికి వాహనాలు పనితీరుపై దృష్టి పెట్టి సర్వీసింగ్ చేస్తూ ఉండాలని.. ఆ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: