విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెంలోని అందలాపల్లి శ్రీ భగీరథి అమ్మవారి దసరా మహోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా.. ప్రతిఏటా నిర్వహించే శూలాల ఉత్సవం ఘనంగా సాగింది.
100 మందికి పైగా భక్తులు శూలాలు తమ శరీరానికి గుచ్చుకుని.. ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి వేషధారణలో ఊరేగింపులు సాగాయి. మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. భక్తి పారవశ్యంలో సాగిన ఉత్సవం.. ప్రశాంతంగా జరిగింది.
ఇదీ చదవండి : VAISAKHA PORT : సాగర తీరాన సమరోత్సాహం.. అమెరికా యుద్ధ నౌకావిన్యాసాలు