వృత్తి రీత్యా వైద్యురాలు అయినప్పటికీ, ప్రభుత్వ అధికారి కావాలనే కొరికతో ఎంతో శ్రమించి... డిప్యుటీ తహసీల్దారుగా ఎంపికైన తన తల్లే స్ఫూర్తి అని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర పేర్కొన్నారు. గ్రూప్-1కి సన్నద్ధమైన మెుదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాన ఆమె...నేడు తూర్పు సబ్ డివిజన్ ఏసీపీగా నియమితులయ్యారు.
నా స్వస్థలం అనంతపురం. నా తండ్రి రమేశ్‌చంద్ర నీటిపారుదలశాఖలో డీఈఈగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. నా తల్లి అనుపమ హోమియో వైద్యురాలు . మా అమ్మకు వృతిపరంగా ఎంతో పేరు ఉన్నప్పటికి ప్రభుత్వ అధికారి అవ్వాలని బలంగా కొరుకుంది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి 41ఏళ్ల వయస్సులో డిప్యుటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె పట్టుదల నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చేది. నా తండ్రి కూడా నన్నెంతగానో ప్రోత్సహించేవారు. బీటెక్ పూర్తయిన వెంటనే గ్రూప్-1 పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువడింది. అందులో మెరుగైన ప్రతిభను చూపి మెుదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాను.
నేడు తూర్పు సబ్‌డివిజన్‌కు ఏసీపీ హోదాలో మొదటి మహిళా అధికారినిగా బాధ్యతలు చేపట్టటం ఆనందంగా ఉంది . సబ్‌డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాల సరళిని అధ్యయనం చేస్తున్నాను. ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకు వీలుగా నా పరిధిలోని సి.ఐ.లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి దర్యాప్తులను వేగవంతం చేస్తాను. ఉన్నతాధికారులు అప్పగించే బాధ్యతలను వేగంగా పూర్తిచేయడంతోపాటు నాకు అందే ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తాను.
నా భర్త విజయ్ మణికంఠ 2018వ బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారి. ప్రస్తుతం విశాఖ గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరం పోలీసుశాఖకు చెందిన అధికారులం కావడంతో వృత్తిపరంగా కూడా నాకు ఎంతో సహకరిస్తారు.
:_ విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర
ఇదీ చదవండీ...'ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యంగం మనది'