ETV Bharat / city

జీవీఎంసీ కమిషనర్​గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సృజన - జీవీఎంసీ కమిషనర్​గా డాక్టర్​ సృజనను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

దాదాపు నెలపాటు సెలవుపై వెళ్లిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సృజనను.. ప్రభుత్వం తిరిగి జీవీఎంసీ కమిషనర్​గా నియమించింది. ఆమె ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జీవీఎంసీ ఎన్నికలకు ముందు అమరావతికి పంపించగా.. అక్కడి నుంచి మరో జిల్లాకు బదిలీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా తిరిగి విశాఖకు తిరిగి రావడం సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.

doctor srujana took charge as gvmc commissioner again
జీవీఎంసీ కమిషనర్​గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సృజన
author img

By

Published : Mar 20, 2021, 6:43 PM IST

జీవీఎంసీ కమిషనర్‌గా.. డాక్టర్‌ సృజన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు నుంచి దాదాపు నెల పాటు ఆమె సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తూ కమిషనర్‌గా నియమించారు.

సెలవులో ఉండగానే సృజనను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. అమరావతిలోని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సూచించింది. ఎన్నికలకు ముందు ఆమె బదిలీ కాగా.. వేరే జిల్లాకు పంపనున్నారని చర్చలు నడిచాయి. కానీ అనూహ్యంగా ఆమెనే మళ్లీ జీవీఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "తిరిగి ఇక్కడికే వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని సృజన తెలిపారు. నగరంపై అవగాహన ఉన్నందున.. కొత్త పాలకవర్గంతో కలిసి మరింత మెరుగ్గా పనిచేస్తానని చెప్పారు.

ఇదీ చదవండి:

ఉక్కు పోరు: కార్మిక మహాగర్జనకు ర్యాలీగా కార్మికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.