ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విశాఖ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గాజువాక దర్గాను సందర్శించారు. మదర్సాలోని విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమది హామీలిచ్చే ప్రభుత్వం మాత్రమే కాదనీ... వాటిని నెరవేర్చే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 80 శాతం నెరవేర్చామన్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా... విశాఖలో వక్ఫ్ బోర్డు భూములు పరిరక్షిస్తామని భరోసా కల్పించారు.
ఇదీ చదవండీ